SAKSHITHA NEWS

Y.F.I Talent Test to bring out the creative self in students

విద్యార్థులలో సృజనాత్మక తను వెలికితీసేందుకు యస్.యఫ్.ఐ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుంది.

-ప్రముఖ విద్యావేత్త,కవి ఫెమా జిల్లా కన్వీనర్ మువ్వా. శ్రీనివాసరావు పిలుపు.

-డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,యస్. యఫ్. ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం.ప్రవీణ్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విద్యార్థులలో సృజనాత్మక తను వెలికితీసేందుకు, భయాన్ని తగ్గించేందుకు యస్.యఫ్.ఐ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని ప్రముఖ విద్యావేత్త, కవి ఫెమా జిల్లా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యస్.యఫ్.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పట్టణ, మండల స్థాయిలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ స్థానిక పట్టణంలోని త్రివేణి స్కూల్ లో టాలెంట్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, కవి ఫెమా జిల్లా అధ్యక్షులు మువ్వా.

శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధోశక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపోందుంచుకోవాలని,విజ్ఞాన వంతులుగా, మేధావులుగా తయ్యారవలని ఆయన తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకలతో పాటు,అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలని సమాజాన్ని అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడంతో వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు యస్. యఫ్.ఐ టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.యస్. యఫ్. ఐ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అన్ని, అందులో గతంలో పనిచేసినందుకు గర్వాంగా ఉందని ఆయన తెలిపారు.

అనంతరం యస్. యఫ్.ఐ మాజీ జిల్లా కార్యదర్శి, ప్రస్తుత డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం, వారి సమస్యలపై పోరాడుతూ, టాలెంట్ టెస్ట్ పెట్టడం అభినందనీయం అన్ని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. యస్.యఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం. ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షకు ధీటుగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, పట్టణ, మండల స్థాయిలో మండలానికి టాప్ ఐదుగురిని ఎంపీక చేసి, జిల్లా స్థాయి టెస్ట్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు

. జిల్లా స్థాయిలో టాప్ ముగ్గురికి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో వ్రాసిన టాప్ విధ్యార్థికి ఆర్థిక పారితోషకం, షీల్డ్స్ సర్టిఫికెట్స్ ఇస్తామని, టాలెంట్ టెస్ట్ విజయవంతం అవడానికి సహకరిస్తున్న ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలకు,విద్యార్థులకు, తల్లితండ్రులకు అందరికి యస్.యఫ్.ఐ జిల్లా కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమం వందన సమర్పణ త్రివేణి స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ చేశారు.

ఈ కార్యక్రమంలో యస్.ఆర్&బి.జి.యన్. ఆర్ కళశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పగిడిపల్లి.వెంకటేశ్వర్లు , యస్.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పర్వీన్, యస్. యఫ్.ఐ ఖమ్మం నగర కన్వీనర్ తరుణ్, యస్. యఫ్.ఐ నాయకులు సంగీత, శ్రీలత, మౌనిక, శ్రావ్య, శరీఫా, నవ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS