ప్రపంచ టిబి దినోత్సవం 2023 : ‘‘అవును! మనం టిబిని అంతం చేయగలము’’
ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ టిబి దినోత్సవం వస్తుంది, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో క్షయవ్యాధి ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతున్నదని సాధారణ ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఈ రోజున నిర్వహించబడుతున్నది.
ఇదే రోజున 1882 సంవత్సరంలో డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికి కారణమైన టిబి బాసిల్లస్‌న కనుగొన్నట్లు బెర్లిన్‌లో ప్రకటించారు. ఐరోపా మరియు అమెరికాలలో ఆ సమయంలో టిబి ప్రబలంగా ఉంది, టిబి కారణంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మరణించేవారు.
ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కి చెందిన ది స్టాప్ టిబి పార్టనర్‌షిప్ అనేది ఈ సంవత్సరం ప్రపంచ టిబి దినోత్సవం కోసం ‘‘అవును!మనం టిబిని అంతం చేయగలము’’ అనే థీమ్‌ను ప్రకటించింది.
ఇటీవలి కాలంలో కూడా, టిబి ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ఒక శాపంగా పరిణమిస్తున్నది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 10.6 మిలియన్ల మంది ప్రజలు టిబితో బాధపడుతున్నారని అంచనా. 2020తో పోల్చితే ఇందులో 4.5% పెరుగుదల ఉన్నది. ఎనిమిది దేశాలు ఈ వ్యాధి యొక్క మొత్తం ప్రపంచ భారంలో మూడిరట రెండు వంతుల వాటా కలిగివున్నాయి, ప్రపంచ భారంలో భారతదేశ వాటా నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువగానే ఉంది. ఇతర ఏడు దేశాలు ఏవనగా (ప్రాబల్యం తగ్గుతున్న క్రమంలో) చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, నైజీరియా, బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా. విషయాలను దృష్టిలో ఉంచుకుంటే : ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా 20 శాతం కంటే తక్కువ ఉండగా, అయితే అదే సమయంలో ప్రపంచంలోని మొత్తం టిబి రోగులలో 25 శాతానికి పైగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, మందులకు లొంగని టిబి భారం కూడా భారతదేశంలోనే అధికంగా ఉన్నది.
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘నేషనల్ టిబి వ్యాప్తి’ సర్వే (2019 – 2021)’ మూడు సంవత్సరాల సర్వే, ఇది గత 55 ఏళ్లలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇదే మొదటిది మరియు దేశంలో క్షయవ్యాధి యొక్క అసలైన వ్యాధి భారంపై ఇది రెండవ జాతీయ సర్వే.
15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులలో క్షయవ్యాధి వ్యాప్తి 1 లక్ష జనాభాకు 312 కేసులు అని సర్వే వెల్లడించగా అదే సమయంలో ప్రపంచ సగటు 1 లక్ష జనాభాకు 134 కేసులు మాత్రమే. అత్యధికంగా 1 లక్ష జనాభాకు 747 టిబి కేసులతో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. 1 లక్ష జనాభాకు 137 కేసులతో గుజరాత్ తక్కువ ప్రాబల్యంను కలిగివుంది. జాతీయ ప్రాబల్యం నోటిఫికేషన్ నిష్పత్తి 2.84గా సర్వే అంచనా వేసింది. (దీని అర్థం నోటిఫై చేయబడిన ప్రతి కేసుకు, సమాజంలో కేసుల వాస్తవ ప్రాబల్యం 2.84). 60% కంటే ఎక్కువ కేసులలో, రోగులు వారికున్న లక్షణాలకు వైద్య సంరక్షణను కోరుకోలేదని కూడా అధ్యయనం అంచనా వేసింది, దీనికి అత్యంత సాధారణ కారణాలు ఏమిటంటే, రోగులు లక్షణాలను విస్మరించడం, లక్షణాలను రోగులు గుర్తించలేకపోవడం, అంతర్లీనంగా వ్యాధి ఉండడం లేదా వైద్య సంరక్షణను అందుకోలేని ఆర్థిక పరిమితులు.
జాన్ బన్యన్, ఒకప్పుడు ‘‘వినియోగం’’ను ‘‘కెప్టెన్ ఆఫ్ ది మెన్ ఆఫ్ డెత్’’ అని సూచించాడు మరియు నిజానికి, చాలా సంవత్సరాలు మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మరణానికి కారణం టిబి అంటువ్యాధి. 2021లో, టిబి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల మరణాలు సంభవించాయని అంచనా వేయబడింది, భారతదేశంలో 4,00,000 మరణాలు సంభవించాయి.
భారతదేశంలో 1962 నుండి నేషనల్ టిబి ప్రోగ్రామ్ (ఎన్‌టిపి) ఉంది. అప్పటి నుండి, మొదట 1997లో రివైజ్డ్ నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్‌ఎన్‌టిసిపి)లోకి మరియు తర్వాత 2020లో నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టిఇపి)లోకి. రెండుసార్లు పునర్వ్యవస్థీకరించబడింది.
టిబి నియంత్రణ ప్రయత్నాలు ప్రారంభంలో నేషనల్ టిబి ప్రోగ్రామ్ (ఎన్‌టిబి)తో నిర్వహించారు, బిసిజి టీకాలు అందించడం ఒక నివారణ చర్యగా ప్రధానంగా దృష్టి సారించింది.
ఎన్‌టిపిని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో టిబి నియంత్రణ కార్యకలాపాలకు కొత్త ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు చికిత్స ఆధారిత వ్యూహానికి ప్రాధాన్యతనిచ్చింది. రివైజ్డ్ నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్‌ఎన్‌టిసిపి), అంతర్జాతీయంగా సిఫార్సు చేయబడిన డైరక్ట్‌లీ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ షార్ట్ కోర్సు (డిఒటిఎస్) వ్యూహాన్ని భారతీయ దృష్టాంతంలో అత్యంత క్రమబద్ధమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న విధానంగా స్వీకరించింది.
వ్యవస్థీకృత మరియు సమగ్రమైన టిబి నియంత్రణ సేవలను అందించడానికి రాజకీయ మరియు పరిపాలనా నిబద్ధత అనేవి డిఒటిఎస్ – డాట్స్ కింద ప్రధాన వ్యూహాలలో కొన్ని. జనరల్ హెల్త్ సర్వీసెస్‌లలో విశ్వసనీయ మరియు ముందస్తు రోగనిర్ధారణ కోసం స్మెర్ మైక్రోస్కోపీ ప్రారంభించబడింది. అవసరాలకు అనుగుణంగా ఔషధాల యొక్క హామీ సరఫరాను అందించడానికి ఔషధాల సరఫరా గొలుసు కూడా బలోపేతం చేయబడింది.
1998 చివరలో ఆర్‌ఎన్‌టిసిపిని పెద్ద-స్థాయిలో అమలు చేయడం ప్రారంభమైంది మరియు తదనంతరం, భారతదేశం 2006లో ఆర్‌ఎన్‌టిసిపి కింద దేశవ్యాప్త కవరేజీని సాధించింది.
ఇది 2006 నుండి ఆర్‌ఎన్‌టిసిపి పేజ్ ॥తో అనుసరించబడిరది. ‘‘మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్’’లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన టిబి-సంబంధిత లక్ష్యాలను సాధించడానికి రెండవ దశ కొత్త స్మెర్ పాజిటివ్ కేసుల యొక్క కనీసం 70% కేసుల గుర్తింపు రేటును అలాగే కనీసం 85% నివారణ రేటును లక్ష్యంగా చేసుకుంది. రోగుల చికిత్స పరంగా చూసినట్లయితే ఆర్‌ఎన్‌టిసిపి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా విస్తరిస్తున్న టిబి నియంత్రణ కార్యక్రమంగా గుర్తించబడిరది.
ఆర్‌ఎన్‌టిసిపిలో పురోగతిని ఏకీకృతం చేస్తూ, దీనికి ఎన్‌టిఇపిగా పేరు మార్చబడింది మరియు ఈ మార్పు 2020 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది.
‘‘ని-క్షయ్’’ (ని-ఎండ్, క్షయ్-టిబి), టిబి నియంత్రణ కోసం ఒక వెబ్ ఆధారితమైన పేషెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది మరొక ముఖ్యమైన విజయం మరియు దాని ద్వారా దేశంలోని మారుమూల ఆరోగ్య సంస్థల నుండి వ్యక్తిగత రోగి డేటాను సంగ్రహించడం మరియు బదిలీ చేయడం ప్రారంభించబడిరది.
భారత మాజీ రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము 2022 సెప్టెంబరు 9న ‘‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’’ను ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’’ ప్రకారం, 2030 నాటికి అన్ని దేశాలు టిబిని నిర్మూలించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కానీ భారత ప్రభుత్వం 2025 నాటికే టిబిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఈ తీర్మానాన్ని నెరవేర్చడానికి ప్రతి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’’ టిబి చికిత్సలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి మరియు టిబి నిర్మూలన దిశగా దేశ పురోగతిని వేగవంతం చేయడానికి భాగస్వామ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడిరది. ఈ కార్యక్రమం కింద, ఏ వ్యక్తి అయినా, ఎన్‌జీవో, కోఆపరేటివ్ సొసైటీ అయినా లేదా కార్పొరేట్ సంస్థ అయినా టిబి ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి ప్రతిజ్ఞ చేయవచ్చు మరియు ‘‘ని-క్షయ్ మిత్ర’’లో చేరవచ్చు. ‘‘ని-క్షయ్ 2.0’’ అనేది టిబి ఉన్న రోగులకు కమ్యూనిటీ మద్దతు కోసం ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఈ ప్రయోజనం కోసం అంకితమైన ‘‘ని-క్షయ్’’కు ఒక హెల్ప్‌లైన్ కూడా ఉంది : 1800-11-6666.
డాక్టర్ వి కేశవన్
సీనియర్ కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్,
అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ.