workers are on strike to release six months salary immediately
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం
నగరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయు పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతం వెంటనే విడుదల చేయాలని సమ్మె చేస్తున్న కార్మికులు
కార్మికులసమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున వైద్య అధికారులు………. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ య్య
ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేయు పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నగరి ఏరియా హాస్పిటల్ కార్మికుల సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి .
కోదండయ్య మాట్లాడుతూ గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న జీతాలు వేయాలని కోరుతూ కార్మికులు నిరసన తెలియపరచు ఉన్నప్పటికీ సంబంధించిన కాంట్రాక్టర్ గాని, జిల్లా వైద్య శాఖ అధికారులు గాని స్పందించడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం జీతాలు పెంచకపోగా , ఇచ్చే జీతం కూడా ఆరు నెలలు ఆపేయడం వలన కార్మికులు కుటుంబ పోషణ భారంగా మారి పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
డ్యూటీ కి రావడానికి కూడా ఆటో చార్జీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం కార్మికుల యొక్క సమస్యల పరిష్కరించడంలో గాని, వాళ్లకి రావలసిన పీఎఫ్ ఈఎస్ఐ సంబంధించి గాని, ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 549 జీవో ప్రకారం 16000 వేలు జీతం ఇప్పించడంలో కూడా అధికారుల నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు, పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో 26 వ తారీకు నుంచి పూర్తిస్థాయి సమ్మె నిర్వహిస్తున్నారు,వేరే మార్గం లేనందునే సమ్మే చేస్తున్నారు.ఇప్పటికైనాజీతాలు వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు వేలన్, భాష రాజేంద్రన్ ,శానిటేషన్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నగోమి,ఉష రూతుప్రబాకర్ ,జెర్సీ, సేల్వి మలికమ్మ సుజాత,ఆశ,సహయమ్మ,సుమతి,రాజశేఖర్,కార్మికులు పాల్గొన్నారు