ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరించిన కమిషనర్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మొహంతి
“సాక్షిత :పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదిని” పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కమిషనర్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మొహంతి ఆకాంక్షించారు. అంతేకాదు మా తోటి అధికారులు అంతా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.