SAKSHITHA NEWS

మహిళలు తమ హక్కుల కోసం సావిత్రిబాయి పూలే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి

-బత్తుల సోమయ్య

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్,

బుధవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు నందు ,తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాదాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా! నిర్వహించారు. ముందుగా గిరిజన రోజువారి కూలీ మహిళలను మరియు ఆశా వర్కర్స్ అయిన మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల ఆర్థిక స్వలంబన అభివృద్ధి అన్ని రంగాలలో అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో ఎన్నో చట్టాలు చేశారు. ఇది ఒక రోజులో నో రెండు రోజుల్లోనో, ఒకరి వలనో ఇద్దరి వలనో జరిగిన పరిణామం కాదు. ఈ మార్పుల వెనక కొన్ని వేల మంది అక్కాచెల్లెళ్ల పోరాటం ఉన్నది. దీనికి ఏ ఒక్క దేశం మినయింపు కాదు అన్ని రంగాలలో మహిళల శక్తిని నిరూపించబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహిళలు సంఘటితంగా ఉంటే ఏ ఉద్యమన్నైనా ముందుకు తీసుకెళ్లగలరనేది చారిత్రిక సత్యం. ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిది, పురుషులతో సమానంగా ప్రాణ త్యాగం చేసిన ఘనత ఈ గడ్డది. నిజాం రజాకార్లు మహిళలపై జరిపిన అత్యాచారాలకు దోపిడీ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో రాణి రుద్రమ పోరాట చరిత్రతో పునీతమైన తెలంగాణ. మిత్రులారా, ఆ వీరనారీమణుల త్యాగాలు వృధా కాకూడదు. వారి ఆశయాలను లక్ష్యాలను బ్రతికించాల్సిన తరుణమిది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు భర్తలు చనిపోతే ఒంటరిగా మిగిలిన మహిళల మీదనే కుటుంబ బాధ్యత పడుతుంది. ప్రభుత్వాల ఆదాయం కోసం మద్యం ఏరులై పారిస్తే తాగుడికి బానిసలై భర్తలు చనిపోతే ఆ కుటుంబాల బాధ్యత మహిళల మీదనే భారం పడుతుంది. పురుషులకు అన్ని రకాల సేవలు చేసే పాత్రలో మహిళలదే ప్రధానమైన పాత్ర. ఆకాశంలో సగం, భూదేవిలో సగం మహిళల పాత్ర అని తెగ పొగుడుతుంటారు. మహిళలకు రక్షణ చట్టాలు ఉన్నాయని నాయకులు ఉదరా గొడతారు. అయితే బాల్యవివాహాలు ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి ? మహిళల మీద వరకట్న వేధింపులు గృహ హింస లు దిశా, టేకు లక్ష్మి లాంటి మహిళల మీద అతి కిరాతకంగా హత్యాచారం చేసి క్రూరంగా హింసించి చంపేశారు. అలాగే ఎంతోమంది మైనర్ బాలికలను నమ్మించి గర్భవతులను చేసి హత్య చేస్తున్నారు. పసిపాపల నుండి పండు ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. స్త్రీలను పిల్లలు కనే యంత్రాల్లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తాళిబండ్ల కంటే మూర్ఖంగా బాధ్యతాయుతమైన కొంత మంది పార్లమెంటు మొంబర్లు భారతదేశంలో ఏనాడో తొలగించబడిన సతీసాగమనాన్ని మళ్లీ ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. స్త్రీని ఆట వస్తువుగా చూస్తున్నారు, ఆల్కహాల్ డ్రగ్స్ సంస్కృతికి పురుషుడు అలవాటు పడటం వలన మానవత్వాన్ని కోల్పోయి స్త్రీల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా స్త్రీలు తమ హక్కులు కోల్పోతూ అణిచివేయబడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అన్ని రంగాలలో మహిళలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఒకపక్క పోరాటం జరుగుతుంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణను సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే లెక్కలేదు, మహిళలకు రక్షణ అంటే పట్టింపు లేదు, మహిళలకు గౌరవం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్, ఒక మహిళ ఆమెని ఏ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గవర్నర్గా చూడలేదు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు తన కేబినెట్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడానికి మనుసు రాలేదు. అంతేకాదు ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న ప్రీతి అనే అమ్మాయిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు, ఒక విద్యార్థిని అంతగా మదనపడి ఆత్మహత్య చేసుకుందా..? లేక హత్య చేశారా..?అనే అనుమానాలు అలానే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కమిషన్ వేయలేదు, ఎటువంటి విచారణ పరిస్థితి లేదు మీడియా కోడై కూస్తున్న ఈ రాష్ట్ర మంత్రివర్గానికి కాని, ముఖ్యమంత్రి కి కాని చీమకుట్టినట్టుగా లేదు, ఏన్నో పాఠశాలలో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉంది బాలికలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం,ఏనాటి నుండో ఉన్న కాలేజీలను, పాఠశాలలను రద్దు చేసే పద్ధతులు అవలంబిస్తుంది. ఈరోజు మహిళలంతా ప్రశ్నించడం ,నేర్చుకోవాలి న్యాయంగా మహిళలకు రావలసిన వాటా మాకు రావాల్సిందే అని ప్రశ్నించాలి,నిలదీయాలి చట్టసభల్లో కాని ఈ రాజ్యాన్ని నడిపించే నాలుగు మూల స్తంభాలైన ఎస్టేట్ లకు మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పించాలని పోరాడవలసిన సందర్భం ఇది కాబట్టి మిత్రులారా ఈరోజు చట్టాలు కేవలం పుస్తకాలకు పరిమితం అవుతున్నాయి.

ఎందుకంటే ఆ చట్టాలను అమలులోకి తేవాలంటే మీ తెగువ తెగింపు ధైర్యం వల్లనే సాధ్యమవుతుంది, పురుషాధిక్య సమాజంలో స్త్రీ తన వాటా తాను పొందాలంటే ప్రశ్నించాలి పోరాడాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీలో ఆ చైతన్యం రావాలని మహిళ అంటే అబ్బల కాదు అని మీరు నిత్యం గుర్తుంచుకోవాలి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి మీ వాటా మీకు దక్కాలి అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరపున మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మీ కోరికలు మీ హక్కులు నెరవేరలని ఆశిస్తున్నాము
అని బత్తుల సోమయ్య అన్నారు .
ఈ కార్యక్రమంలో మహిళలు గిరిజ గారు హెల్త్ సిస్టర్ గారు స్వాతి గార్లు మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని ప్రభుత్వాలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బడ్జెట్లో మహిళలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బత్తుల పంకజ కల్వకుంట్ల లత ఉజ్వల నాగలక్ష్మి అనసూయ స్రవంతి సునీత రమణమ్మ పాషాభి మంగమ్మ మరియు ఎస్.కె అఫ్జల్ వర్తియా రాజేష్ నాయక్ రామాంజనేయులు వడ్డేబోయినవెంకటేశ్వర్లు గజ్జల ఎల్లయ్య గార్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS