ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలో కొత్త మార్కెట్ యార్డ్ హమాలి కార్మికులకు ఇండ్ల స్థలాలు.
— మేడే వారోత్సవాల్లో ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్.
తాండూరు, మే 1: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలో తాండ్రలో కొత్త మార్కెట్ యార్డ్ ఏర్పాటు హమాలి కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ తెలిపారు. సోమవారం మే డే సందర్భంగా పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్ యార్డులో నిర్వహించిన మేడే వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హమాలీ కార్మిక సంఘం నాయకులు మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ ముందుగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఏ మార్కెట్ కమిటీ చైర్మన్ చేయని విధంగా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. కార్మికులకు కూలి రేట్లు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా కార్మికులకు రెండు జతల యూనిఫాంలో అందజేయడం జరిగిందని తెలిపారు. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలో తాండూరు మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్న హమాలీ కార్మికులకు 5 ఎకరాల స్థలంలో ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ సమీపంలో 30 ఎకరాల్లో కొత్త మార్కెట్ యార్డును ప్రారంభించనునట్లు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ పాలకులు చేయని విధంగా స్థానిక ఎమ్మెల్యే యువ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి కనివిని ఎరగని రీతిలో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏకకాలంలో 134 కోట్లు నిధులతో అభివృద్ధిని చేస్తున్న ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం కార్మికులకు మే డే ను పురస్కరించుకుని యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ కౌన్సిలర్ సోమశేఖర్, ముక్తార్ నాజ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గోపాల్, అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు భీమప్ప ప్రధాన కార్యదర్శి బాలప్ప కార్మిక నాయకులు బద్రు రాజేష్ నర్సింలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలో కొత్త మార్కెట్ యార్డ్ హమాలి కార్మికులకు ఇండ్ల స్థలాలు.
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…