రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో వైసిపికి శవయాత్ర తప్పదంటూ తీవ్రస్థాయిలో మండిపడిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు. 23-05-2023 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ,కంబదూరు మండల కేంద్రంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిధిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు బాణా సంచా పేల్చి, భైకి ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రచ్చ కట్టలో ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలతో ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చుకోకుండా అవినీతి అరాచకాలు ద్యేయంగా పాలన కొనసాగిస్తుందంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటలు చొప్పున పని చేస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పని చేస్తూ దేశంలో రాష్ట్రాన్ని అగ్రగాముగా నిలపాలని ధ్యేయంగా పనిచేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ జన చైతన్య యాత్రలు, గౌరవ సభ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు ప్రజల మద్దతుతో రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగిస్తున్నామని ఇదే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు అండదండలతో మొదటి పది స్థానాల్లో నిలిపినందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ విషయంలో మొదటి పది స్థానాల్లో ఉండే విధంగా సహకరిస్తూ నాయకులు ప్రజలు కార్యకర్తలు కృషి చేస్తారని, చేయాలన్నారు.
గత ప్రభుత్వంలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా కుటుంబానికి ఎంతో ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు. ప్రతి రైతుకు ఎరువులు, డ్రిప్పు పరికరాలు, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించి కష్ట సమయాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తన అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. కానీ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకుండా గాలికి వదిలేసారని ఎధ్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గించాలని అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.కావున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఐక్యమత్యంతో జగన్మోహన్ రెడ్డికి పాడే కట్టాలని అందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…