ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయండి

Spread the love

16, 17 తేదీలలో ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు

హాజరు కానున్న డిప్యూటీ సిఎం భట్టి, కూనంనేని

“ఆహ్వాన సంఘ సమావేశంలో ఈయు నేత తిమ్మినేని

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈనెల 16, 17 తేదీలలో ఖమ్మంలో జరగనున్నాయని మహాసభలను జయప్రదం చేయాలని ఈయు నేత తిమ్మినేని రామారావు కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరుగుతున్నాయని ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కొత్తగూడెం శాసన సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఆయన -తెలిపారు. మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి కందుల భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిమ్మినేని రామారావు మాట్లాడుతూ రవాణా రంగ అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి మిళితమై ఉంటుందని ప్రజా రవాణా సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.

రోడ్డు, -రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యత అని అన్నారు. ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ 2023లోనే మొదలైందన్నారు. కానీ 2019 నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ట్రెడ్ యూనియన్ల పై ఉక్కు పాదం మోపిందని రామారావు తెలిపారు. ఈ దశలో కార్మికుల పై యాజమాన్య వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. ఆర్టిసిలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరింత పెరిగాయన్నారు. ఆర్టిసిలోని అన్ని విభాగాల సిబ్బంది సమస్యలను ఈ మహాసభలలో చర్చిస్తామన్నారు. తృతీయ మహాసభలో భట్టి విక్రమార్క, కూనంనేని తో పాటు ఏఐటియుసి నేత విఎస్ బోస్, ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, -కార్యదర్శులు ఎస్. బాబు, ఈ, వెంకన్న, జాతీయ నాయకులు పద్మాకర్, ఎపిఎస్ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్, నర్సయ్య పాల్గొంటారని రామారావు తెలిపారు. ఆహ్వాన సంఘ సమావేశంలో కోశాధికారి పాటి అప్పారావు, యూనియన్ -నాయకులు జి. మోహన్రావు, వెంకటరెడ్డి, జికె కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page