SAKSHITHA NEWS

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు

-వల్లభి చెక్ పోస్ట్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్

……

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా సరిహద్దులో పటిష్టమైన చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …జిల్లాలో మోహ‌రించిన కేంద్ర
పోలీసు బ‌ల‌గాలతో పాటు స్ధానిక పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి
ప్రవేశించే మార్గాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా
సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు,నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి, 15 ఎస్ఎస్టి, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 x7 గట్టి నిఘా ఉంచామని తెలిపారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.

WhatsApp Image 2024 03 18 at 5.31.16 PM

SAKSHITHA NEWS