ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు తక్షణమే చెల్లించాలి?
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ శ్రీమతి పాచి పెంట శాంతకుమారి డిమాండ్.
అరకు నియోజకవర్గం
అరకు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు అరకు నియోజకవర్గము. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి అరకు వేల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయము అరకు వేల్లినుండి మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రతినెల ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులకు. రెవిన్యూ. ట్రెజరీ. విద్యా. వైద్య. అంగనవాడి.
ఎన్ఆర్ఈజీఎస్. వెలుగు. శాఖలు మొదలగు.సుమారు మొత్తం 64 శాఖలకు జీతభత్యాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగస్తులకు మోసం చేసిన వైసిపి పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో నేటికీ 11వ తేదీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించకపోవడం చాలా దుర్మార్గము ఉద్యోగస్తుల కుటుంబాలు బ్యాంకు లోన్లు ఇంటి అద్దె మరియు స్కూల్ పిల్లలకు ఫీజులు చెల్లించడం చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగికి సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీతభత్యాలు చెల్లిస్తూ ఉండేవారు పర్మినెంట్ ఉద్యోగులు. కాంట్రాక్టు ఉద్యోగులు మరియు ఔట్సోర్సింగ్ దినసరి కూలీ అందరికి కూడా తక్షణమే జీతభత్యాలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూనాము లేనియెడల ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం కాంగ్రెస్ పార్టీ నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము