SAKSHITHA NEWS

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోయారు.

కొంతమంది ఫస్ట్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో పరీక్ష రాస్తుంటే.. ఇంకొంతమంది ఇక మంచి మార్కులు పొందాలని అనుకుంటున్నారు. మరి కొంతమంది పాస్ మార్కులు వచ్చిన చాలు అని ఆశపడుతూ ఇక పరీక్షలు రాసేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే పరీక్షల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

ఈ క్రమంలోనే ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కూడా అటు అధికారులు పెట్టారు అన్న విషయం తెలిసిందే. అంటే పరీక్షకు సరిగ్గా తొమ్మిది గంటల లోపు హాజరవ్వాలి. 9 దాటిన తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇక విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు. ఈ క్రమంలోనే మొదటిరోజు నుండే ఎంతో మంది విద్యార్థులు ఒక్క నిమిషం నిబంధన కారణంగా చివరికి పరీక్ష రాయకుండానే వెను తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది విద్యార్థులు తప్పయింది.. ఇంకోసారి ఇలా జరగదు సార్.. నన్ను పరీక్ష రాయనివ్వండి.. నా భవిష్యత్తు పాడవుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అటు అధికారులు మాత్రం కనికరించడం లేదు. అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడానికి ఇలా ఒక్క నిమిషం నిబంధనను పెట్టడం మంచిదే

కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎందుకు ఇలా ఒక్క నిమిషం నిబంధన పెట్టడం లేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు 11:30 కు వస్తున్న పట్టించుకునే నాధుడు లేడ. కానీ ఇక బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి ఎదగాలి అనుకున్న విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన పెట్టి చివరికి పరీక్ష రాయకుండా జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు చాలామంది యువత. ఈ ఒక్క నిమిషం నిబంధన ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు పెడితే మన సిస్టం ఇంకా బాగుపడేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించక సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ముందు వారికి ఒక్క నిమిషం నిబంధన పెట్టి.. తర్వాత విద్యార్థులకు పరీక్షల విషయంలో ఈ రూల్ పెట్టి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరేం అనుకుంటున్నారు

WhatsApp Image 2024 02 29 at 1.09.17 PM

SAKSHITHA NEWS