గ్రాడ్యుయేట్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదయ్యా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి
సాక్షిత నంద్యాల జిల్లా డోన్
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల జిల్లా టిడిపి ఇన్చార్జ్ మాండ్రా శివానందరెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డోన్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్సీ పరిశీలకులు శవాల దేవదత్ లా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పట్టబద్రులకు వారి ఓటును వజ్రాయుధంలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసి గెలిపించాలని విలేకరుల సమావేశం ద్వారా తెలియజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరూ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు ఓటు కోసం నమోదు చేసుకోలేదని అలాంటి నిర్లక్ష్య ధోరణిని ఆవిలంబిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైసిపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్టబదారులను కోరడం చాలా విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు అడగడం చాలా సిగ్గుచేటని చెబుతూ 2019 ఎన్నికల ద్వారా ప్రజల యొక్క ఆశీస్సులతో అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పటినుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ప్రతి ఏటా జనవరిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మభ్యపెట్టి వారి ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి తీరా అధికారం చేపట్టాక వారిపై కక్ష సాధింపుతో యువతను నిరుద్యోగంలోకి నెట్టి ఇటు ఉపాధ్యాయులను పట్టభద్రులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు ఉండేవని పలు కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవని తీర ఈ ముఖ్యమంత్రి వారందరినీ భయపెట్టి అవి మన రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రాలకు తరలించారని ఇలాంటి ముఖ్యమంత్రి కి తగిన గుణపాఠం చెప్పాలంటే రాబోవు ఎన్నికల ముందు జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠం నేర్పాలని పట్టభద్రులైన మేధావులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళి కృష్ణ గౌడ్,డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలింద్ర శ్రీనివాసులు యాదవ్,నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నెం గౌతమ్ కుమార్ రెడ్డి,