కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కొంపల్లి మున్సిపాలిటీ అవని గార్డెన్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు అయినప్పుడే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం వెంకటేశ్వర రెడ్డి, అధ్యక్షులు వై. రాజా రమణ గౌడ్, ప్రధాన కార్యదర్శి శేశవరావు, కోశాధికారి కె. శ్రీకాంత్, ఉపాధ్యక్షులు సతీష్, కమిటీ సభ్యులు రాజు, గోవర్ధన గౌడ్, నారాయణరెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.