మీ సమస్యల పరిష్కారానికే..మీ వార్డుకు వచ్చాము..డా౹౹గోపిరెడ్డి *
సాక్షిత : 16వ వార్డ్ లోని 2.89 కోట్లలతో సంక్షేమ పథకాలు ద్వారా లబ్దిదారులకు అందజేశాం, 2.20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ లు, వాటర్ పైప్ లైన్స్, గడప గడప ద్వారా అభివృద్ధి, ఇళ్ల పట్టాల కింద 62 మందికి మంజూరు చేయగా, tidco కింద 72 మందికి మంజూరు చేసిన..
-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
నరసరావుపేట పట్టణంలోని పట్టణంలోని 16వ వార్డు అనగా శ్రీ రామపురం సంబంధిత సచివాలయంలో “జగనన్న సురక్ష” కార్యక్రమం ప్రభుత్వ అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలసి “జగనన్న సురక్ష” క్యాంపుని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రారంభించారు.._
ఈ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ నేరుగా మిమ్మల్ని కలుసుకొని, సమస్యలు తెలుసుకొని..పరిష్కరించడం కోసమే మీ వార్డుకు వచ్చాము..సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు మీ వార్డ్ కి వచ్చాము..ఏ సమస్య ఉన్న నాతో చెప్పండి అంటూ నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందరిని ఆప్యాయంగా పలకరించారు..
ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించటంలో మధ్యవర్తులు, దళారులు ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలందరికీ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దే అని తెలిపారు..
అలాగే మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వ పథకాలు నగదు తమ ఖాతాలలోకే పడుతున్నాయని మహిళలు ప్రభుత్వ పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ.. మతం, కులం, చూడకుండా అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ప్రతి కుటుంబానికి రూ. 1లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు లబ్ధి కలుగుతుందని, ఈ సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలు జరగాలంటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ని సీఎం చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని పొందిందని.. అది తట్టుకోలేక ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని చూసినా.. ప్రజలంతా ఏకతాటిపై మళ్ళీ సీఎం గా జగన్ ని అధికార పీఠంపై నిలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు..
అనంతరం ఆదాయ, కుల, జనన మరణ, తదితర 11 రకాల సర్టిఫికెట్లను పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. 16వ వార్డ్ లోని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వివిధ అర్జీలను తక్షణమే పరిశీలించి అర్హత కలిగిన ధ్రువీకరణ పత్రాలను శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ ఇన్చార్జిలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పెద్ద ఎత్తున వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..