107వ రోజు ప్రగతి యాత్ర….
కె.పి. వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానంచేసిన కమలమ్మ కాలనీ వాసులు…
డివిజన్ లోని ప్రతి కాలనీ, బస్తిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పాదయాత్ర చేసారు.ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా అక్కడక్కడా నెలకొన్న భూగర్భడ్రైనేజీ, అంతర్గత రోడ్లు, సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్బంగా తమ కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తూ మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు,
అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వారి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ కె.పి. వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానంచేసారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులూ కస్తూరి బాలరాజ్, కమలాకర్, హుస్సేన్, సింగారం మల్లేష్, నవాబ్, ఇబ్రహీం ఖాన్,దూలప్ప, చెట్ల వెంకటేష్,మహేష్, దిలీప్, మూస ఖాన్, నగేష్, మహిళ అధ్యక్షురాలు సంధ్య రెడ్డి, మామి, ఫర్జానా, లక్ష్మి, పార్వతి, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.