SAKSHITHA NEWS

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా,

మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

జి.కొండూరు మండలంలోని వెలగలేరు, వెల్లటూరు గ్రామాల్లో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరిపైరును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. చేతికి వచ్చిన దశలో వరిపైరు నోటికి అందకుండా పోవడం పట్ల ఆవేదన చెందారు.

తుఫాన్ తీరం దాటిన తర్వాత విపరీతంగా వీచిన గాలుల కారణంగా వరిపనలు నేలవాలిపోయాయని పేర్కొన్నారు. నీట మునిగిన వరిని, అన్నదాతల కష్టాలను స్వయంగా చూసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు చలించిపోయారు. అప్పటికప్పుడు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో మాట్లాడి, తక్షణమే నష్టపరిహారం అంచనాలను నివేదించాలన్నారు.

పంట నష్టపరిహారంతో పాటు, తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ

మిచాంగ్ తుఫాన్ వల్ల వరిపైరుకు ఎక్కువశాతం నష్టం కలిగిందన్నారు. ఇప్పటికే జరిగిన నష్టం గురించి ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు ఇప్పటికే తగు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. వెలగలేరులో మామిడి, ఇతర గ్రామాల్లో మిరప, పత్తి కూడా దెబ్బతిందని వీటికి కూడా పారదర్శకంగా అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 12 06 At 4.28.23 Pm

SAKSHITHA NEWS