SAKSHITHA NEWS

కేసీఆర్ ని ఒడిస్తామన్న ముదిరాజులు

భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ ల సమావేశంలో కేసీఆర్ ని ఓడిస్తామన్న ముదిరాజ్ లు.

ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు నీల నాగరాజ్ ముదిరాజ్,కొండ సాయిలు ముదిరాజ్ లు మాట్లాడుతూ రాబోవు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన టికెట్లలో ముదిరాజ్ లకు తీవ్ర అన్యాయం జరిగిందని,బీసీ ల్లో అత్యధిక శాతం ఉన్న,సుమారు 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించని కేసీఆర్ కు బుద్ధి చెప్తామని,ముదిరాజ్ ల సత్తా ఏందో చూపెడతామని అన్నారు.


బీసీ డి నుండి బీసీ ఏ రిజర్వేషన్లలో కి మార్చడంలో కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించిందని దాని వల్ల మా ముదిరాజ్ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని,124 మార్కులు వచ్చిన కానిస్టేబుల్ అభ్యర్థుల్ ఎంపిక కాకపోవడం దారుణం అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నాతో పాటు ప్రతీ గ్రామం నుండి నామినేషన్ వేసి కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని హెచ్చరించారు.
అత్యధిక జనాభా ఉన్న మాకు నామినేటెడ్,కార్పొరేషన్ పదవులు అవసరం లేదని శాసన సభలో సీట్లే లక్ష్యంగా,బీసీ ఏ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా కేసీఆర్ ని ఒడిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోయిని సాయిలు, బోయిని నర్సింహులు , కొండ సంతు,కోండ సిద్దరాంలు,బీమరి రఘుపతి, కొండ మాసయ్య, ఇంకా ముదిరాజ్ సదర్‌ సంఘం సభ్యులు అందరు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS