We will investigate and do justice according to law … District SP Siddharth Kaushal IPS
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ .
[సాక్షిత కర్నూల్ జిల్లా… స్పందన కార్యక్రమానికి 101 ఫిర్యాదులు .
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పందన కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
మా షాపుకు అడ్డంగా రేకులు, రాడ్లు పాతిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాధవరం గ్రామానికి చెందిన ఈడిగ సుజాత ఫిర్యాదు చేశారు.
భర్త హింసిస్తున్నాడని ఆమడగుంట్లకు చెందిన నాగేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు.
మోసపూరితంగా ప్లాట్ ను తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మాపై దాడి చేసే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు, స్వామి రెడ్డి నగర్ కు చెందిన లత ఫిర్యాదు చేశారు.
పెద్దల సమక్షంలో ఖాళీ గా ఉన్న స్థలం ను రస్తా కి వదలడం జరిగింది , అయితే ఒక వ్యక్తి ఆ రస్తా కి అడ్డుగా రాళ్లు వేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని కర్నూల్ మండలం, ఈ. తాండ్రపాడు గ్రామ వాసులైన బాధితులు 6 మంది ఫిర్యాదు చేశారు.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నందు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూల్ బాలాజీ నగర్ కు చెందిన అయ్యన్న ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ హామీ ఇచ్చారు.
ఈ స్పందన కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీ నాగభూషణం, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.