సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

SAKSHITHA NEWS

కార్మికుల రిలే నిరాహారదీక్షకు హాజరై సంఘీభావం తెలిపిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని హామీ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కంపెనీ వద్ద 51వ రోజు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. కార్మికులు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని, న్యాయం జరిగేలా తోడుంటామని భరోసానిచ్చారు. యాజమాన్యం మెడలు వంచైనా కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి కార్మికులకు న్యాయం జరిగేలా సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కెవి యూనియన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి, సీఐటీయూ ప్రెసిడెంట్ మల్లికార్జున్, జెసిఎల్ చతుర్వేది మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS