టీటీడీ నిత్య అన్నదానం మరింత విస్తరిస్తాము

Spread the love

సాక్షితతిరుపతి : శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
టీటీడీ నిత్య అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుప‌తి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్ర‌క్క‌న ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్య‌క్ర‌మాన్ని టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్ర‌తి రోజూ లక్ష మంది భ‌క్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నార‌న్నారు.

గతంలో నేను టీటీడీ ఛైర్మ‌న్‌గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామ‌న్నారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో త‌రిగొండ వెంగ‌మాం అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, పిఏసిలు త‌దిత‌ర ప్రాంతాల్లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన్న‌ట్లు చెప్పారు. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయ‌ని త‌న‌ చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. టీటీడీ ఛైర్మ‌న్‌గా శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యం వ‌ద్ద‌ ప్రతి రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్‌లో ఈ అన్నదాన కార్యక్రమాన్నిమరింతగా విస్తరిస్తారించ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఛైర్మ‌న్‌, ఈవో క‌లిసి భ‌క్తుల‌కు అన్నప్ర‌సాదాలు వ‌డ్డించారు. టీటీడీ అందిస్తున్న అన్న‌ప్ర‌సాదాల రుచి, నాణ్య‌త గురించి భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాదాల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, జేఈవో వీర‌బ్ర‌హ్మం, ఎఫ్.ఎ.అండ్ సిఎవో బాలాజి, సిఇ నాగేశ్వ‌ర‌రావు, సిపిఆర్వో డా.తలారి ర‌వి, డెప్యూటీ ఈవోలు శాంతి, రాజేంద్ర కుమార్‌, విజివో బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page