రైతే రాజు..
రైతుల పాలనా కొనసాగిస్తాం..
నరసరావుపేట నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉప్పలపాడు గ్రామానికి చెందిన శనివారపు వాసుదేవ రెడ్డి ప్రమాణ స్వీకారం..
వైస్ చైర్మన్ గా అర్వపల్లి గ్రామానికి చెందిన పులుసు అన్నపూర్ణమ్మ w/o కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం..
మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న..
-నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో చైర్మన్ మరియు నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అటహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా నూతన కార్యవర్గ సభ్యులకు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరు కావడంతో మార్కెట్ యార్డ్ ప్రాంగణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉప్పలపాడు గ్రామానికి చెందిన శనివారపు వాసుదేవ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గా అర్వపల్లి గ్రామానికి చెందిన పులుసు అన్నపూర్ణమ్మ w/o కోటేశ్వరరావు , మిగతా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేకు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..ఈ శుభ సందర్భంగా డా౹౹గోపిరెడ్డి మాట్లాడుతూ..నూతన పాలకవర్గ సభ్యులు మరియు చైర్మన్ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ భవనం నిర్మాణం కొరకు సాంక్షన్ కూడా చేపించటం జరిగింది అని తెలిపారు.
.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కొనియాడారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి రైతులు ఆశీర్వదించాలని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం రైతుల పైన నాయకుల పైన ప్రజల మీద ఉందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు…ఇటీవల అకాల వర్షాలకు పంట పొలాలు ఎంత నష్టపోయిందని నష్టపరిహారం అందించమని పేర్కొన్నారు.
రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులను విత్తనాలను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతులకు తన వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అందిస్తున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయం ఆవరణంలో ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది..ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీ, వైస్-ఎంపీపీ, మండల కన్వీనర్, ఎంపిటిసిలు సర్పంచులు, ఉప-సర్పంచులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు మరియ వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అభిమానులు, నియోజకవర్గ స్థాయి నాయకులు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు..