ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గం.ల వరకు 16వ నెంబర్ జాతీయ రహదారిపై వచ్చు వాహనాలను దారి మళ్ళించడం జరుగుతుంది
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
అత్యవసర పరిస్థితులలో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారి పై కోరిశపాడు మండలం పిచికల గుడిపాడు వద్ద 4.1 కి.మి ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను మార్చి 18 న సోమవారం భారత వైమానిక దళం అధికారుల నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారి పై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు మార్చి 18 న ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ జరగనున్న నేపథ్యంలో సుమారు 528 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 18 న ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అందువల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలను ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు దారి మళ్ళించడం జరుగుతుందన్నారు.
గుంటూరు వైపు నుండి ఒంగోలు, నెల్లూరు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను రేణంగివరం జంక్షన్ నుండి అద్దంకి పట్టణంలోని నామ్ హైవే మీదుగా మేదరమెట్ల వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిలో కలిసే విధంగా దారి మళ్ళించడం జరిగింది.
ఒంగోలు వైపు నుండి చిలకలూరిపేట, గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్ళు వాహనాలను మేదరమెట్ల నుండి నామ్ హైవే మీదుగా అద్దంకి పట్టణంలో నుండి రేణంగివరం జంక్షన్ వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిలో కలిసే విధంగా దారి మళ్ళించడం జరిగింది.
ఒంగోలు వైపు నుండి గుంటూరు, విశాఖపట్నం వైపు వెళ్ళు భారీ వాహనాలను 16 నెంబర్ జాతీయ రహదారిపై మేదరమెట్ల వద్ద వున్న హోల్డింగ్ పాయింట్ లో నిలుపుదల చెయ్యడం జరుగుతుంది.
గుంటూరు వైపు నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు భారీ వాహనాలను 16 నెంబర్ జాతీయ రహదారిపై మార్టూరు (రాజుపాలెం) వద్ద వున్న హోల్డింగ్ పాయింట్ లో నిలుపుదల చెయ్యడం జరుగుతుంది.
వాహనదారులు ఈ విషయం గమనించి సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ సూచించారు.