నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నాం – యస్.పి
— పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా అవాస్తవాలు రాయవద్దు
— బదిలీల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు – యస్.పి
నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)
మిర్యాలగూడ సబ్ డివిజన్ లో చక్రం తిప్పుతున్న కానిస్టేబుల్” శీర్షికన గురువారం ఈనాడు నల్లగొండ జిల్లా సంచికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని నిరాధారమైన ఆ కథనాన్ని ఖండిస్తున్నామని యస్.పి అపూర్వ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా పరిధిలోని ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని బదిలీల కౌన్సిలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఓపెన్ ఆడిటోరియంలో సిబ్బంది, అధికారుల సమక్షంలోనే బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించామన్నారు.
కథనంలో పేర్కొన్నట్లు
ఓకానిస్టేబుల్ రూ.30 లక్షలు వసూలు చేశారనేది అవాస్తవం. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా అవాస్తవాలు ప్రచురించడం సరికాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా బదిలీల్లో వసూళ్లు అంటూ కథనాలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ వాస్తవ విషయాలను ప్రచురించాలని యస్.పి కోరారు.