ప్రభుత్వమిచ్చిన సెలవు దినాలు మా ప్రైవేట్ స్కూల్ కు వర్తించవు.

Spread the love

ప్రభుత్వమిచ్చిన సెలవు దినాలు మా ప్రైవేట్ స్కూల్ కు వర్తించవు.

సాక్షిత ప్రతినిధి. అంటున్న కల్వకుర్తి బచ్పన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు. బీజేవైఎం కల్వకుర్తి పరుష రాములు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బచ్పన్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రూటే సపరేటు అనే విధంగా ప్రిన్సిపాల్ తీరు ఉంటుంది. ప్రభుత్వం ఒక పూట బడులు నిర్వహించమని చెప్పినా తమకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన ప్రైవేట్ స్కూల్ కి అవి పని చేయవని. రెండు పూటలా బడి నడుపుతున్న కల్వకుర్తి బచ్పన్ ద ఢిల్లీపబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్. ఇతని తీరు పిల్లల్ని చితకబాదిన వెళ్లి తల్లిదండ్రులు అడగకూడదు. అడిగితే చాలు అతని నోటికి పని చెప్తాడని అతని మాటలు పడలేక ఇటు తమ పిల్లల చదువు పాడవుతుందని ఎవరికి చెప్పుకోలేకపోతున్నామని. కల్వకుర్తి ప్రవేట్ పాఠశాలల్లో అన్ని ఒకే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులతో ఒక పూట స్కూల్ నడుస్తూ ఉంటే ఇతను రెండు పూటలు స్కూల్ నడుపుతాడని ఎండాకాలం కావడంతో చిన్నపిల్లలు నానా ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోడని. బాబు జగ్జీవన్ రామ్ జయంతి నాడు ఇటు ఎంఈఓ అటు కలెక్టర్. ప్రభుత్వ ఉత్తర్వులు కాదని యధావిధిగా స్కూల్ నడిపించడం తో బీజేవైఎం కల్వకుర్తి మండల అధ్యక్షులు పరుశరాములు వెళ్లి విద్యార్థుల తరఫున ప్రిన్సిపాల్ నిలదీయగా మీరు ఎవరికీ చెప్పినా భయపడేదిలేదని అడగడానికి మీరెవరు అని నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరిగింది.

ఈ సందర్భంగా కల్వకుర్తి బీజేవైఎం అధ్యక్షుడు పరశురాములు మీడియా తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకుండా కల్వకుర్తి పట్టణంలోని బచ్పన్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం రెండు పూటలా స్కూల్ నడుపుతుందని అలాగే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్కూలు యధావిధిగా నడవడంతో ఇట్టి విషయం తన దృష్టికి రావడంతో ఎంఈఓ బాసు నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అయినా స్కూల్ యాజమాన్యం యధావిధిగా స్కూల్ నడపడం జరిగిందని ప్రిన్సిపాల్ అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తు ప్రభుత్వమిచ్చిన సెలవు దినం నా స్కూల్ బచ్పన్ స్కూలుకు వర్తించదని ఎంఈఓ చెప్పిన కలెక్టర్ కు ఫోన్ చేసి చెప్పిన భయపడేది లేదని అంటున్నాడనీ ప్రభుత్వ సెలవు దినం కల్వకుర్తి లో అన్ని స్కూల్లో కు ఒక రూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఒక రూల్ కల్వకుర్తిలో బచ్పన్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నర్సరీ నుండి ఏడో తరగతి వరకు ప్రైమరీ స్కూల్ అందులో విద్యార్థులను మానసిక ఒత్తిడికి శారీరక ఒత్తిడికి గురవుతున్నారని తెలంగాణ ప్రభుత్వం వంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది కల్వకుర్తిలో అన్ని స్కూల్స్ ఒక పూట బడులను నిర్వహిస్తుంటే బచ్చన్ ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమానులు మాత్రం తమకి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉదయం 7 :00 .గంటల నుంచి 4:00 వరకు స్కూల్స్ నడుపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కి చెప్పిన పట్టించుకోవడం తో ఎండాకాలంలో తమ పిల్లల ఆరోగ్యం పాడవుతున్న అనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్ సర్ ని ఇదేంటి అని చిన్నపిల్లలు అంతసేపు ఉండలేరు అని ప్రశ్నిస్తే ఏం కాదు వాళ్లకు బాక్సులు పెట్టి పంపియండి ఉండగలుగుతారు.

అని సమాధానం చెప్తున్నాడని మానసికంగా పిల్లలపై ఒత్తిడి అవుతుందని తమ పిల్లలు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు మీడియాకు వివరించారు. తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేసి అదేవిధంగా రిజల్ట్ రావాలని పిల్లలపై మానసిక శారీరక ఒత్తిడి తీసుకొస్తున్న ఆ స్కూల్లో పై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి బీజేవైఎం మండల అధ్యక్షుడు పరశురాములు అన్నారు. ఇంత జరుగుతున్నా ఎంఈఓ బాసు నాయక్ అసలు తనకు పట్టనట్టు విహరించడం పలు అనుమానాలు వస్తున్నాయనీ. కాబట్టి కల్వకుర్తి పట్టణంలోని బచ్పన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కర్ణాకర్ పైన ఎం ఈ ఓ బాసు నాయక్ పైన అధికారులు డి. ఈ. ఓ. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page