కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో 126- జగద్గిరిగుట్ట డివిజన్ మైనారిటీ అధ్యక్షులు అజం, మైనారిటీ సీనియర్ నాయకులు యూసుఫ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మౌలానాలు బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మౌలానాలు, ఇమామ్ లకు వేతనం అందజేస్తూ వారి సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ గారన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి విజయ డంకా మోగించి ముచ్చటగా మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో మైనారిటీల అభ్యున్నతి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మౌలానాలు వహీద్, సమద్, ఇంతియాజ్, హనీఫ్, ఈతయం, అస్లం ఖయామ్ తదితరులు పాల్గొన్నారు.