Warning that drunken vehicles are driving at high speed
హుజరాబాద్ ఏసీబీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తప్ప తాగి వాహనదారులు వాహనాలు అతివేగంగా నడుపుతున్నారని హెచ్చరిక
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ కన్వెన్షన్ హాల్లో హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని తాగి వాహనాలు నడిపిన చోధకులకు హుజురాబాద్ ఏసిపి శ్రీ కోట్ల వెంకటరెడ్డి గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ సీఐ బొల్లం రమేష్, జమ్మికుంట టౌన్ సిఐ రామచందర్, జమ్మికుంట రూరల్ సీఐ సురేష్, హుజురాబాద్ ఎస్సై రాజన్న మరియు సిబ్బంది పాల్గొన్నారు.