SAKSHITHA NEWS

ఓటరు జాబితా సవరణలకు నూతన మార్గదర్శకాలు – తిరుపతి సదస్సులో డిప్యూటి ఎలక్షన్ కమిషనర్

సాక్షిత, తిరుపతి బ్యూరో: కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందదని, వాటి అమలుకు అత్యధిక ప్రాదాన్యత ఇవ్వాలని డిప్యూటి ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, న్యూడిల్లీ అధికారి నితీష్ కుమార్ వ్యాస్ సూచించారు. శనివారం స్థానిక సరోవర్ హోటల్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలసి జిల్లా ఎన్నికల అధికారు లైన చిత్తూరు కలెక్టర్ ఎం.హరినారయణన్, తిరుపతి కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఇఆర్ ఓ లతో సమావేశమై పలు సూచనులు చేసారు. డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందని, ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజక వర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2023 షెడ్యూల్ మేరకు ప్రి రివిజన్, రివిజన్ ప్రక్రియలు జరపి తుది జాభితా 2023 జనవరి 5 న ప్రచురించాలని తెలిపారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పవర్ పాయింట్ ద్వారా వివరిస్తూ జిల్లాల విభజన మేరకు 26 జిల్లాల్లో వున్న అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఈ నెల 4 నుండి ఇ సి ఐ ఆదేశాలతో ప్రిరివిజన్ ప్రక్రియ మొదలైందని నవంబర్ 7 నాటికి పూర్తిచేసి, రివిజన్ యాక్టివిటీ 2023 జనవరి 3 నాటికి పూర్తిచేసి 5 న ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకటన చేయనున్నామని వివరించారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. హరినారాయణన్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల వివరాలను….తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి తిరుపతి జిల్లా లోని నియోజకవర్గాల వివరాలను విడివిడిగా
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమీక్షలో ఇ సి ఐ ఎల్ సి ఇ ఓ సంజయ్ సౌబే , ఇసిఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఇ ఆర్ ఓలు పీలేరు -చినరాముడు, మదనపల్లి – మురళి, పుంగనూరు -డి సుబ్రహ్మణ్యం, తిరుపతి -చంద్ర మౌళీశ్వర రెడ్డి, శ్రీకాళహస్తి -శ్రీనివాసులు, నగరి – లక్ష్మి, చిత్తూరు – రేణుక, పలమనేరు – భవాని, కుప్పం -ప్రభాకర్ రెడ్డి, గూడూరు – వి.మురళీకృష్ణ, సూళ్లూరు పేట – కె ఎం రోస్ మాండ్, వేంకటగిరి – సాంబ శివారెడ్డి, చంద్రగిరి – కనక నరసారెడ్డి, పూతలపట్టు – పర్వీన్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS