మాడల్ కార్పొరేషన్ లో VNR నర్సరీ/పార్క్ గోవిందా: బిజెపి
నిజాంపేట్ కార్పొరేషన్, సాయి నగర్ రోడ్లో (VNR నర్సరీ పార్క్),2 డివిజన్లో, సర్వే నెంబర్ 143, 144 సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ లో నర్సరీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నాటినుండి దాదాపు మూడు ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలు పెట్టి బోర్వేసి , గేటు పెట్టి,ఫెన్సింగ్ వేసి మొక్కలను అభివృద్ధి చేస్తూ కార్పొరేషన్ లో హరితహారం కింద డెవలప్ చేశారు. కానీ నిన్న రాత్రి నుంచి సీలింగ్ సర్ప్రైస్ ల్యాండ్ మాదే అని కొందరు వ్యక్తులు(speed vidyuth venture pvt Ltd)రాత్రికి రాత్రి నర్సరీ గేట్లు పగలగొట్టి బోర్డులు పీకేసి నర్సరీ లోపల ట్రాక్టర్లు ట్యాంకర్లు ఉన్నా కూడా 500 మీటర్ల ఫెన్సింగ్ వేసుకోవడం చూస్తే మరి అధికారులు అధికార పార్టీ నాయకులు పార్కుల నర్సరీలో అక్రమ మార్గంలో కబ్జా చేసుకుంటే కాపాడలేని అధికారులు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని, దాదాపు మూడెకరాల నర్సరీ ప్రైవేటు స్పీడ్ విద్యుత్ వెంచర్ లిమిటెడ్ కి ఎలా బదులాయింపు చేస్తారని మరియు కార్పొరేషన్ 40లక్షల రూపాయలు పెట్టి VNR నర్సరీ/ పార్క్ గా తీర్చిదిద్దినంక ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఎలా స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేశారని కమిషనర్ మున్సిపల్ అధికారులు ఫోన్లో మాట్లాడగా మాకేం తెలియదని బొకాయిస్తూ కబ్జాదారులకు వంతు వాడుతున్నారని, మోడల్ కార్పొరేషన్ అని చెప్పి ఎమ్మెల్యే, మేయర్ కనీసం కార్పొరేషన్ పార్కులు నర్సరీలు కబ్జావుతుంటే, కాపాడలేని పరిస్థితిలో ఉండడమే కాకుండా పట్టించుకోవడం లేదు అంటే కబ్జాదారులతో కుమ్మక్కై ప్రజలకు పంగనాం పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు మరియు అధికారలు,BRS పార్టీ నేతలు నర్సరీ స్థలాన్ని కాపాడుకుంటే భారతీయ జనతా పార్టీ మూడు రోజుల్లో ప్రత్యక్ష కార్యచరణను ఎదుర్కోవాల్సి ఉంటదని బిజెపి నాయకులు హెచ్చరించారు..