మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై తీవ్ర నిరసనలు

Spread the love

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై తీవ్ర నిరసనలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్డుపైనే కట్టెలపొయ్యిపెట్టి వంట వార్పు.. మోదీ దిష్టి బొమ్మ దగ్ధం…
ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న మోదీ ప్రభుత్వంకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉన్నాయి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్…*


సాక్షిత : పెంచిన వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం చౌరస్తా నుండి షాపూర్ నగర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. షాపూర్ నగర్ చౌరస్తాలో రోడ్డుపైనే కట్టెలపొయ్యిపెట్టి వంట వార్పు నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన సంవత్సరాలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెంపుతోనే సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్రం మరోసారి గ్యాస్ బాంబ్ పేల్చిందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో మళ్లీ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరవడం ప్రారంభించిందన్నారు. ఇలా ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం మోదీ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page