SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్ ను KPHB సీఐ వెంకటేశ్వర రావు తో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సజావుగా, సంప్రదాయబద్దంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలనీ నిమజ్జనం పాయింట్ల వద్ద పకడ్బందీ బార్ కేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు.ఒక్కొక్క పాయింట్ వద్ద రెండు పెద్ద క్రేన్లు, ఒక చిన్న క్రేన్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాండ్ లో తగినంత నీరు ఉండేలా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం స్థలాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను (స్విమ్మర్లను) మూడు షిప్టులలో నియమించాలన్నారు. గణేష్ నిమజ్జనం ప్రదేశాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ మరియు నాయకులు నిరంజన్ గౌడ్, సురేష్, వాసు, హనుమంత రావు, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS