SAKSHITHA NEWS

గుంటూరు జిల్లా.
వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టండి – జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ,.

ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నది ఒడ్డున గల సీతానగరం పుష్కర ఘాట్ ను సందర్శించి,వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ ఆదేశించినారు.

అదే విధంగా ఈనెల 31వ తేదీన జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి భక్తులు ప్రతిష్టించుకున్న విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల అధికారులు ముందుగానే గుర్తించి,ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిమజ్జన ప్రాంతాలైన కాలువలు,నదులలో భక్తులు ఎక్కువ దూరం వెళ్లకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రొక్లైనర్,జేసీబీ వంటి వాటితో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

నిమజ్జన సమయంలో చిన్న పిల్లలు,మద్యం సేవించినవారు కాలువలు/నదులలో దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

 వినాయక చవితి సందర్భంగా విగ్రహా నిమజ్జనాల దృష్ట్యా కృష్ణానది తీరాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన 
 అనంతరం సీతానగరం కృష్ణా నది తీరాన వినాయక నిమజ్జన పరిసర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి పర్యటించారు 

కృష్ణానది ఉద్రిక్త ప్రవాహం దృష్ట్యా వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరుగు కృష్ణానది ప్రాంతంలో ఎయిర్ బోట్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు,నాటు పడవలు, అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు
అదేవిధంగా
ఇరిగేషన్, కార్పొరేషన్, అధికారులతో కలిసి వినాయక నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఐపిఎస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ తో పాటు నార్త్ డి ఎస్ పి రాంబాబు , తాడేపల్లి సి ఐ శ్రీ శేషగిరిరావు స్పెషల్ బ్రాంచ్ సీఐ నరసింహ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS