వారసత్వంగా వచ్చిన ఇండ్లకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని గంగారం (16,27వ వార్డులు) మరియు 9వ వార్డులో ఉదయం 06:30 AM నుండి 10:30 AM వరకు పర్యటించారు.
గంగారంలో ఎంతో కాలంగా ఉన్న వారసత్వ ఇండ్లకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపగా….. వారికి వెంటనే పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

థర్డ్ వైర్ మరియు ఫిఫ్త్ వైర్ ఏర్పాటు చేయాలని, కాలనీలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు దిమ్మేలు ఎత్తుగా నిర్మించి కంచె ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేయాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు.
కాలనీలలో నూతన రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
రోడ్లపై అడ్డంగా ఉన్న బోర్లను ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
మ్యాన్ హోల్స్ పాడైపోయిన చోట వెంటనే నూతన మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page