SAKSHITHA NEWS

*నిరంతర ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో, వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన 267 మందికి BC కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు మంజూరైన లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులు పంపిణి చేశారు.
ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడై ఉంటే మనవాడై ఉండాలని, తెలంగాణ ప్రజలకు ఏ సమయంలో ఏం కావాలో ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలుసని, ఉమ్మడి ప్రాంతంలో తెలంగాణకు ఎనలేని అన్యాయం జరిగిందని, నేడు మనవారు ముఖ్యమంత్రి అయినందుకే మన ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.


వికారాబాద్ లో వలస వచ్చిన సోయిలేని పక్షులను వదిలేసి, అతి తక్కువ కాలంలో వికారాబాద్ ప్రాంతానికి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని శాశ్వత పరిష్కారం చూపిస్తున్నవారినే మళ్లీ ఎన్నుకోవాలన్నారు.
ప్రజా సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకంలోనైనా ఎలాంటి అవతవకలు జరిగితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు
అనంతరం వికారాబాద్ మండలం మరియు వికారాబాద్ మున్సిపాలిటీకి చెందిన 9 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS