సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రమాదంలో గాయపడిన వారిని అటుగా వెళుతున్న వైరా ఏసీపీ రహెమాన్ తమ సిబ్బందితో కలసి సహాయం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణ మారి గాలి దుమారంతో పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడటంతో
వందనం , కొదుమూరు మార్గం మద్యలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ వంతెన పనుల క్రమంలో సమీపంలో వున్న విధ్యుత్ లేని కరెంట్ స్ధంబం ప్రమాదవశాత్తు
పనిచేస్తున్న కార్మికులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో చింతకాని వైపు వెళ్తున్న వైరా ఏసీపీ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని, ప్రమాదానికి గురైన ఉత్తరప్రదేశ్ చెందిన బాబ్లు ను వద్దకి వెళ్లి స్వయంగా క్షతగాత్రులను తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మానవత్వాన్ని చాటుకున్న వైరా ఏసీపీని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అభినందించారు.