వీణవంక వాహనదారులకు సహకరిస్తున్న రైతన్నలకు ఎస్ఐ శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

Spread the love

Veenavanka SI Shekhar Reddy thanked the farmers who are helping the motorists

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో వాహనదారులకు సహకరిస్తున్న రైతన్నలకు ఎస్ఐ శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

వీణవంక మండలంలోని రైతులకు రోడ్ల పైన వరి ధాన్యం కుప్పలు,మొక్కజొన్న కంకులు ఆరబెట్టడం వలన కలిగే ప్రమాదాల వల్ల దుష్పరిణామాలు, 
నష్టాలను, వాహనదారులకు ఎదురయ్యే  ఇబ్బందుల 
పై పోలీసులుఅవగాహన కలిగించారు చాలామంది రైతులు పంటలను  పొలంలోనే పరదాలు వేసుకుని వడ్లను ఆరబోసుకోవడం అలవాటు చేసుకోo టున్నా రు .గురువారం రోజున చల్లూరు వద్ద వాహనాలు తనిఖీలు చేసే క్రమంలో చాలామంది వాహనదారులు రోడ్డు పక్కన పొలంలో వడ్లను ఆరబెట్టుకున్న దృశ్యాలు కనబడ్డాయి చల్లూరు గ్రామానికి చెందిన కల్వల కుమార్ అనే రైతు వద్దకు వెళ్లి రోడ్డుపైన కాకుండా పొలంలో వడ్లను పరదాలలో ఆరబోసుకున్నందుకు వాహనదారులు రైతన్నకు ధన్యవాదాలు తెలుపడం జరిగిందని, వీణవంక పోలీసులు చేపట్టిన చిన్న ప్రయత్నంతో రైతుల్లో పెద్దమార్పు మొదలైనందుకు సంతోషంగా ఉందని, మండలంలోని రైతన్నలు కల్వల కుమార్ అనే రైతులు ఆదర్శంగా తీసుకొని,పంట పొలాలలోని వరి ధాన్యాన్ని ఆరబోసుకోవాలని, వీణవంక ఎస్సై కే శేఖర్ రెడ్డి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page