SAKSHITHA NEWS

మోకిల తాండ ప్రాథమిక పాఠశాలకు సి సి కెమరాలు అందజేసిన వర్త్య బాబు నాయక్.

సాక్షిత శంకరపల్లి : మోకిల తండా ప్రాథమిక పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చుతున్న గ్రామ/ తాండ వాసి వర్త్య బాబు నాయక్ పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా బాబు నాయక్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు అన్ని రకాలుగా రక్షణగా ఉండడం కోసం అలాగే పాఠశాలలో సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండడాని కోసమై ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి సంకల్పించానని తెలియజేశారు.

పాఠశాలలో గ్రామంలోని ఎంతోమంది యువకులు తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామం అటువంటి మొక్కలు ఎదగకుండానే తుంచి వేయడం జరుగుతూ ఉన్నది. అలాంటివి ఇకముందు జరగకుండా ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోదపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామంలోని యువకులు మన గ్రామ పాఠశాలలోని సమస్యలు తెలుసుకొని కనీస వసతుల కల్పనకు ముందుకు వచ్చి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.

తనవరకు పాఠశాలకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను దశలవారీగా చేపడుతానని.. పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు, విద్యార్థులలో క్రమశిక్షణకు, విద్యార్థులు అన్ని రంగాల్లో మంచిగా రాణించేందుకు తన వంతు సహకారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామ యువకులు సోమలానాయక్, సురేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Image 2024 08 20 at 18.25.40

SAKSHITHA NEWS