వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
చిట్యాల సాక్షిత ప్రతినిధి
వాసవి క్లబ్ లెజెండ్ చిట్యాల, వాసవి వనిత క్లబ్ చిట్యాల ఆధ్వర్యంలో ఆదివారం చిట్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే డాన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిట్యాల శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేదవారికి బియ్యం, చీరలు,దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే రిటైర్డ్ మిలటరీ కిరణ్ రెడ్డి, రైతు మెండే సైదులు, యోగ గురువు పున్న పాండులను సన్మానించారు. ఈ సందర్భంగా
వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ నంబూరి వెంకట పద్మజ, డైమండ్ స్టార్ గ్రంధి సత్య నాగ నరసింహారావు, రాయపూడి భవాని తదితరులు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో పాటు పేదవారికి ఆర్థిక సహాయం అందజేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వేంకటేశ్వర్లు, జిల్లా మహిళ అధ్యక్షురాలు పందిరి గీత, మండల అధ్యక్షుడు తెరటుపల్లి హనుమంతు, జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లు షీలా సత్యనారాయణ, రంగా వెంకటేశ్వర్లు,బుద్ధ కృష్ణమూర్తి, పొలపెద్దయ్య, పోల బాసయ్య మండల మహిళ అధ్యక్షురాలు పోల ధనమ్మ, శీల అనిత,పోల సరోజ, మండల యువజన అధ్యక్షుడు కలకుంట్ల రవి, పట్టణ అధ్యక్షుడు వనమా ప్రవీణ్, పోలనవీన్ ల తో పాటు వాసవిక్లబ్ ట్రెసరర్ ఇమ్మడి వెంకన్న, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు వనమా హైమా అరుంధతీ వేంకటేశ్వర్లు, సెక్రెటరీ వనమా మౌనిక,ట్రెసరర్ పోల సరితా తదితరులు పాల్గొన్నారు.