రావులపల్లి కలాన్ గ్రామానికి వైకుంఠ రథం అందజేత
శంకర్పల్లి :నవంబర్ 11:శంకర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన వానరాసి క్రిష్ణమూర్తి వారి నాన్న, నానమ్మ జ్ఞాపకార్థంగా రావులపల్లి కలాన్ గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం డొనేట్ చేశారు. సోమవారం ఈ వైకుంఠ రథం ప్రారంభోత్సవానికి చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకుడు బద్దం కృష్ణరెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, పర్వేద ఎంపీటీసీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.