Upendra takes oath as Chief Minister of Gujarat
గుజరాత్ ముఖ్యమంత్రిగా నేడు ఉపేంద్ర ప్రమాణ స్వీకారం
🔹హాజరు కానున్న ప్రధాని మోదీ అమీషా, పలువురు ముఖ్యమంత్రులు
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్ వరుసగా రెండోసారి గాంధీనగర్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు.
రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్రపటేల్‌తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ మైదానంలో ప్రమాణం చేయిస్తారు.
ఘట్లోడియా స్థానాన్ని భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుచుకున్నారు. ఎమ్మెల్యేలు కాను దేశాయ్, రాఘవ్‌జీ పటేల్, రుషికేశ్ పటేల్, హర్ష్ సంఘవి, శంకర్ చౌధరి, పూర్ణేశ్ మోదీ, మనీషా వకీల్, రమణ్‌లాల్ పాట్కర్ తదితరులను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భాజపా 156 స్థానాలు గెలుచుకుని వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్‌పార్టీకి 17, ఆప్‌నకు 5 స్థానాలు దక్కాయి. 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ శుక్రవారం తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేశారు. శనివారం ఆయనను భాజపా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.