SAKSHITHA NEWS

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్ పరిధిలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 13CMRF చెక్కులను ఇంటింటికీ తిరుగుతూ అందచేశారు. తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడతూ ఇంటింటికీ తిరుగుతూ చెక్కులను అందించే విధానాన్ని గత ఎనిమిది సంవత్సరాలుగా పాటిస్తున్నామని తద్వారా ప్రభుత్వ పధకాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తార్నాక డివిజన్ పరిధిలోని మనికేశ్వరి నగర్, రవీంద్ర నగర్, సత్య నగర్, లాలాపేట, తార్నాక తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈ సందర్భంగా విస్తృతంగా పర్యటించారు. తన దృష్టికి వచ్చిన వివిధ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారి చేశారు