అనుమతులు లేని కోళ్ల ఫారాలు

Spread the love

ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం మండలం

అనుమతులు లేని కోళ్ల ఫారాలు
-పంచాయతీ పర్మిషన్లు లేకుండా ఇష్టారాజ్యంగా వెలసిన కోళ్ల ఫారాలు

  • రిజిస్ట్రేషన్ అనుమతులు లేకుండా కొన్ని,రిజిస్ట్రేషన్ లో సర్వే నెంబర్ ఒకటి కోళ్ల ఫారం నిర్మాణం మరొకచోట
    -పంచాయతీ అధికారులు చోట నాయకులు లక్షల్లో దండుకొని వారి అండదండలతో ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోళ్ల ఫారాలు ఏర్పాటు
    -ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న బాధ్యత కలిగిన పంచాయతీ అధికారులు-నిద్రావస్థలో యంత్రాంగం
    -ఎవరైనా ఇలాంటి వాటి గురుంచి పిర్యాదు ఇస్తేనే మాకు సంభందం మేము పట్టించుకుంటా లేకుంటే ఏమి జరిగిన మేము చేసేది ఏముంటుంది అని బహిరంగంగా చెప్తున్న అధికారులు
    -అనుమతులు లేని కోళ్ల ఫారాలపై అధికారులు దృష్టి ఎందుకు పెట్టటం లేదంటున్న ఆయా గ్రామాల ప్రజానీకం
    -పంచాయతీ ఉత్వర్వులు లేని కోళ్ల ఫారాలపై విద్యుత్ సప్లై ఎలా వస్తుంది.ఇక్కడ కూడా చేతి వాటం బాగానే పుచ్చుకున్నారన్న అభియోగాలు
    త్రిపురాంతకం న్యూస్*త్రిపురాంతకం మండలంలో విచ్చవిడిగా ప్రభుత్వ పంచాయతీ అనుమతులు లేని కోళ్ల పెంపకం ఫారాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.వీటికి ఖచ్చితంగా పక్కా రిజిస్ట్రేషన్ స్థలం మరియు అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలి.దీని కంతటికి ముందు పంచాయతీ అప్రోవల్ ఇవ్వాలి.రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.దీనికంతటికీ త్రిపురాంతకం మండలంలో విరుద్ధంగా జరుగుతుంది. నాయకులు చోటా నాయకులు కొందరిని పట్టుకొని పంచాయతీ అధికారుల చేతి వాటం చూపించి రిజిస్ట్రేషన్, పంచాయతీ అప్రోవల్ అగ్నిమాపక కేంద్రం పర్మిషన్లు ఇతరత్రా ఏ పర్మిషన్లు లేకుండానే కోళ్ల ఫారాలు విచ్చలవిడిగా వెలిశాయి.అడిగే వాడేవడు మాకు డబ్బు ఉంది బలం ఉంది ఏమవుతుంది అనే ధోరణిలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా కోళ్ల ఫారాలు పెట్టేస్తున్నారు.రోడ్డు మార్గం కు దగ్గరగా ఏదొక స్థలం ఎస్సైన్మెంట్ భూముల్లో కోళ్ల ఫారాలు బిజినెస్ కొనసాగిస్తూ అవి రిజిస్ట్రేషన్ స్థలం లో పెట్టినట్లు గా కాకి లెక్కలు చూపిస్తున్న చేతివాటం చూపించిన అధికారులు మాత్రం ఏది ఏమైనా మాకేం పట్టదు.లోకల్ నాయకులు అయినా చెప్పాలి,వారు చెప్పటమే గాక మా వాటా మాకు ఇవ్వాలి అన్న ధోరణిలో ప్రభుత్వ నియమాలను అధికారులే తుంగ లో తొక్కుతున్నారు అనే భిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. త్రిపురాంతకం పరిసర ప్రాంతాలలో ఇలాంటి కోళ్ల ఫారాలు కోకొల్లలుగా వెలిశాయి.రోడ్డు మార్గానికి దగ్గరలో రైతుల పొలాల మధ్యలో ఇటువంటి కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయడంతో చుట్టూ ప్రక్కల పొలాల వారు పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ పొలం పనికి వెళితే ఎక్కడ విష పురుగులు వస్తాయో అని భయబ్రాంతులకు గురి అవుతున్నారు.కోళ్ల పెంట వాసనకు,అక్కడ దుర్గంధం కు విష పురుగులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసిన ఆ దుర్గంధం వలన ప్రజలకు అనారోగ్యాలు పూర్తిగా దెబ్బ తింటాయని తెలిసిన అధికారులు మాత్రం మాకేం పట్టలేదు ఎవరు ఎలా చస్తే మాకెందుకు అనే ధోరణిలో ఉన్నారు.ఇటువంటి కోళ్ల ఫారాలపై అనధికార ప్రజలకు ప్రాణాలతో చెలగాటం ఆడే చీకటి వ్యాపారాలపై సంభందింత అధికారులు ఎందుకు చర్యలుంతీసుకోవటం లేదు,కనీసం ఆ చుట్టు ప్రక్కలకు వెళ్లి విచారణ చేసిన దాఖలాలు కూడా ఎక్కడా ఎందుకు ఉండటం లేదు,అసలు అనుమతులు లేని కోళ్ల ఫారాలు దగ్గర సంభందింత పంచాయతీ అధికారులు ఎంత తీసుకొని ఉంటారు.ఏమి అమ్యామ్యా లు ముడుపులు అందక పోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.అసలు గ్రామాల్లో ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులకు తెలియాదా,పర్మిషన్లు లేకుండా లెక్కలేని తనంగా కోళ్ళ ఫారాలు నడుపుతుంటే పంచాయతీ అధికారులు ఏమి చోద్యం చూస్తున్నారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.రిజిస్ట్రేషన్ భూమి లేకున్నా పక్కన ఎవరోకరిలో భూమిలో రిజిస్టర్ చేసుకోండి మీరు మాత్రం వ్యాపారం దుకాణం మీ ప్రభుత్వ భూమిలోనే కొనసాగించు కోండి ఏదైనా అయితే నేను చూసుకుంటా,మీరు మాత్రం నన్ను బాగా చూసుకోవాలి అన్న కోణంలో పంచాయతీ అధికారులు ఈ అనుమతులు లేని దొంగ అనుమతులు కలిగిన కోళ్ళ ఫారాలను నాయకుల పంచాయతీ అధికారుల అండదండలతో నడుస్తున్నాయని సుస్ప్రష్టంగా అర్ధం అవుతునదని ప్రజలు గుసగుసలాడుతున్నారు.ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి అనుమతులు లేని కోళ్ళ ఫారాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page