జగన్ పాలనలో రాష్టం రావణ కాష్టంలా మారింది: పార్థసారథి

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కి నిరసనగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలొ అంబేద్కర్ సర్కిల్
నందు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జ్ బికె. పార్థసారథి ఆధ్వర్యంలో 15 వ రోజు రిలే నిరాహార దీక్ష చెప్పటారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామరావు చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు. ఈ రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు

అనంతరం పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు.
రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు ని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంతలా సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు పై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు.


చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు.
టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ. దీక్షలొ పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమిoపజేశారు
ఈ కార్యక్రమంలొ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు,జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page