SAKSHITHA NEWS

సయ్యద్ మదర్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

వరద ముప్పుకు గురైన రాకాసి తండా వరద బాధితులకు చేయూత

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

మున్నేరు వరద ప్రభావం తో సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నార్తులను ఆదుకునేందుకు మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీజ పిలుపునిచ్చారు. గురువారం మున్నేరు వరద ఉధృతికి ఇండ్లు మునిగి, నిత్యావసర వస్తువులు, బట్టలు, ఆస్తులు కోల్పోయి కట్టు బట్టలతో అనాధలుగా మిగిలిపోయిన తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వాసులకు సయ్యద్ మదార్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లు అండగా నిలిచాయి. గురువారం రాకాసి తండ వాసులకు జాయింట్ కలెక్టర్, తహసిల్దార్ చేతుల మీదుగా దుప్పట్లు, లుంగీలు, నైటీలు, టవల్సు లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మదర్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ ఇమామ్ వారి ప్రతినిధులను ఆమె ప్రశంసించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు చారిటబుల్ ట్రస్టులు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకున్న ట్రస్ట్ సభ్యులకు తండావాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహ్మద్ అఫ్జల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ, తిరుమలాయపాలెం మండలం ఎంపీడీవో మహమ్మద్ సిలార్, సాహెబ్ మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, మండల నాయకులు పోట్ల కిరణ్, గుగ్గిళ్ళ అంబేద్కర్, తాడికొండ కిరణ్, జడల నగేష్, సయ్యద్ సైదా, ఇమామ్, షేక్ సైఫుద్దీన్, ఉపేందర్, జడల రమేష్ మండల యువజన నాయకులు దూదిమెట్ల వెంకట్, తిమ్మిడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS