తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో
మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
సాక్షిత జగిత్యాల జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వినాయక చవితి పండగ పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా మట్టి వినాయక విగ్రహలను ఉపయోగించాలని ప్రతి జిల్లాకు పంపిణి చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాకు 2000 మట్టి వినాయక విగ్రహలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన విగ్రహలతో చెరువులలలు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహలను ఉపయోగించి చెరువులను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. IAS పిలుపునిచ్చారు. దీనికి సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో. తెలంగాణ కాలుష్యం నియాత్ర మండల తరఫున E.కనక జ్యోతి .అసిస్టెంట్ సహాయక శాస్త్రవేత్త. కలెక్టరేట్ సూపరెంట్. డి డబ్ల్యూ నరేష్ తదితరులు పాల్గొన్నారు