SAKSHITHA NEWS

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ సాంప్రదాయాల తో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నారు. కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలు పెడుతుంటారు బంగారం, కొత్త వస్తువులు ,కొత్త వాహనాలు, కొత్త ఇల్లులు ,లాంటివి కొంటారు కొత్త వ్యాపారానికి కూడా శుభతరంగా భావిస్తారు, ఉగాది పండుగ రోజున పులిహోర ,పాయసం, బొబ్బట్లు అనేది ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్త మామిడికాయలు వేప పువ్వు బెల్లం పసుపు కారం ఇలా ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారుచేస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు . ఉగాది రోజు చెప్పే పంచాంగం వినడం ఆనవాయితీ మణి శంకర్ నాయక్ తెలియజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు, రాథోడ్ శంకర్,రాథొడ్ చందర్ ,రాథోడ్ మోహన్,రాథోడ్ బాబు,రాథోడ్ రవి ,రాథోడ్ వసన్,రాథోడ్ బాలు,పాత్లోత్ లక్ష్మణ్ ,పాత్లోత్ గోపాల్ ,మూడవత్ రాజు ,మూడవత్ కిషన్ ,నున్సవత్ రవి ,నున్సవత్ సురేష్ ,మేఘవత్ సేవ్య నాయక్ ,మేఘవత్ టోపీయా ,వర్థ్య రాము ,వర్థ్య సేవ్య పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 10 at 4.19.53 PM

SAKSHITHA NEWS