SAKSHITHA NEWS

ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం.

పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో ఉగాది పండుగను ‘గుడి పడ్వా’ పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు.

పండుగ విశేషాలివీ..

మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని అంటారు.
బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన.
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే.
ఉగాది టైంలోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది.

కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలుపెడుతుంటారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు.
ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారు చేస్తారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ.

WhatsApp Image 2024 04 08 at 4.53.00 PM

SAKSHITHA NEWS