హైదరాబాద్:
తెలంగాణలో తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు తన నామినేషన్ ను ఉదయం దాఖలు చేశారు.
నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పదో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా నిర్మల్ లో బిజెపి అభ్యర్ధి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా నామినేషన్ వేశారు.
అభ్యర్థులు ఈసారి తమ నేరాలను దాచే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. వాటిని స్పష్టంగా పేర్కొనాలంటూ ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
అంతేకాదు, వాటిని మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైలులో కనుక ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మొత్తం 3.17 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబరు 3న ఫలితాలను వెల్లడిస్తారు.