SAKSHITHA NEWS

Tour of Ponguleti in Khammam city

ఖమ్మం నగరంలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
సాక్షిత : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం నగరంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వినోద మహల్ రోడ్లోని 7డేస్ అకాడమీ స్టడీ హాల్ ను ప్రారంభించారు. ఎస్.ఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. అదేవిధంగా రెడ్డి సంఘం నాయకులు దగ్గుల మాధవ రెడ్డి భార్య ప్రథమ వర్థంతి కార్యక్రమానికి హాజరైయ్యారు.

ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ మలీదు జగన్, మైనారిటీ నాయకులు ఇమామ్ భాయ్, చింతమళ్ల గురుమూర్తి, మియాభాయ్, చల్లా రామకృష్ణారెడ్డి, బోడా శ్రావణ్, అజ్మీరా అశోక్ నాయక్, మొగిలిచర్ల సైదులు, తోట ప్రసాద్, రాయల పుల్లయ్య, అప్పన పిచ్చన్న, గుండ్ల కోటేశ్వరరావు, జాన్ పాషా (గన్), యువనేత గోపి, కుర్రా సతీష్ కుమార్, ఆటో రాంప్రసాద్, గునగంటి రమేష్ తదితరులు ఉన్నారు.

జూలూరుపాడు మండలంలో పొంగులేటి పర్యటన

జూలూరుపాడు : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జూలూరుపాడు మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని యల్లంకి గార్డెన్స్, ఆర్.కె గార్డెన్స్ లలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టువస్త్రాలను కానుకగా అందించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, విజయబాయి, ధరావత్ రాంబాబు, ఎంపీటీసీ మధుసూధన్, లేళ్ల గోపాల్ రెడ్డి, లాలు నాయక్, నరేష్, నర్సింహారావు, పుల్లారావు, కృష్ణయ్య, నాగరాజు, శ్రీను, గుగులోత్ రమేష్, శివకుమార్, సత్యనారాయణ, అమ్రు తదితరులు ఉన్నారు.

చండ్రుగొండ మండలంలో పొంగులేటి పర్యటన

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చండ్రుగొండ మండలంలో బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని సీతాయిగూడెంలో జరిగిన ఓ వివాహా వేడుకకు హాజరైయ్యారు. నూతన దంపతులను దీవించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. అయ్యన్నపాలెం గ్రామంలో కొల్లు తిరుపతి రెడ్డి తల్లి దశదిన కర్మలో పాల్గొన్నారు. చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, జారె ఆదినారాయణ, ఎంపీపీ పార్వతి, భోజ్యానాయక్, అంకిరెడ్డి క్రిష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ నరకోళ్ల సత్యనారాయణ, చెవుల చందర్ రావు , గాదె లింగయ్య, ఎంపీటీసీ సంగోడి వెంకటకుమారి, సర్పంచ్ లక్ష్మీపతి, నరకోళ్ల అప్పాజీ, నున్నా వెంకటేశ్వర్లు, గుగులోతు రాములు, నెల్లూరి ప్రసాద్, బన్నె రాము, సంగోడి రాఘవులు, బన్నె నాగరాజు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS