SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 07 at 7.22.17 PM

టమోటా ధరలు తగ్గాయి …

టమోట ధరలు సగానికి తగ్గుముఖం పట్టాయి.

ములకలచెరువు వ్యవసా య మార్కెట్‌లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గు తూ వస్తున్నాయి.

నిన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం అత్యధికంగా రూ.2300కి చే రింది.

నాణ్యతను బట్టి బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు పలికింది

బాక్సు రూ.4300 నుంచి రూ.2300కు తగ్గిన ధర

నాణ్యతను బట్టి కిలో రూ.65 నుంచి రూ.100

టమోటా ధరలు సగానికి తగ్గుముఖం పట్టాయి.

ములకలచెరువు వ్యవసా య మార్కెట్‌లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గు తూ వస్తున్నాయి.

నిన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం అత్యధికంగా రూ.2300కి చే రింది.

నాణ్యతను బట్టి బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు పలికింది.

నిన్నటి వరకు డబుల్‌ సెంచరీకి చేరువైన కిలో ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.100కు పడిపోయింది.

ధరలు ఇంకా కొన్ని రోజులు అధికంగా ఉంటాయనుకున్న ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ధరలు మరింత తగ్గుతాయేమోనని నిరాశ చెందుతున్నారు.

ములకలచెరువు మార్కెట్‌ నుంచి రెండు రోజుల క్రితం వరకు 10 లోపు లారీల టమోటాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి.

ప్రస్తుతం ప్రతి రోజూ చిన్న వాహనాలతో పాటు మొత్తం 20 లారీల కాయలు ఎగుమతి అవుతున్నాయి.

ఇక్కడి నుంచి ఢిల్లీ, చత్తీ్‌సఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

వైరస్‌ కారణంగా కర్ణాటక రాష్ట్రంలో టమోటా పంటలు దెబ్బతినడంతో ధరలు నిలకడగా ఉండవచ్చని పలువురు రైతులు ఆశగా ఉన్నారు.

గుర్రంకొండలో కిలో రూ.88

గుర్రంకొండ మార్కెట్‌లో ఆదివారం కిలో టమోటా రూ.88 పలికింది.

బయట రాష్ట్రాల్లో టమోటాల దిగుబడి రావడం, స్థానికంగా కూడా రైతులు టమోటా పంటను సాగు చేయడంతో టమోటా దిగుబడి పెరిగింది.

వారం రోజుల కిందట మార్కెట్‌ యార్డుకు 100 క్వింటాళ్లలోపు టమోటాలు రాగా ప్రస్తుతం రోజుకు 300 కింటాళ్లకుపైగా వస్తున్నాయి.

ఈ క్రమంలో మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి.

గుర్రంకొండ మార్కెట్‌ యార్డులో కిలో టమోటా ధర రూ.88 పలికింది.

ఈ లెక్కన 25 కిలోల టమోటా క్రేట్‌ ధర రూ.2200 గరిష్ట ధర పలికింది.


SAKSHITHA NEWS