హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం

Spread the love

ఏలూరు .గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం భారీగా తరలివచ్చిన వి ఆర్ ఏ ల సామూహిక నిరాహార దీక్షలను సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ 2018 అలంకార్ సెంటర్లో జరుగుతున్న వీఆర్ఏల ధర్నాకు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం అధికారులకు రాగానే వీఆర్ఏలకు 15000 జీతం పెంచుతానని చేసిన వాగ్ధానం గుర్తు చేశారు.

ఆ హామీని నాలుగున్నర సంవత్సరాలైనా నేటికీ అమలు చేయకపోవడం ఆయన మోసకారితనానికి నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఏలు పోరాడి సాధించుకున్న డి ఎ ను ఈ ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవడం దుర్మార్గన్నారు. వీఆర్ఏల నోటి కాడ కూడు లాగేసుకున్నట్టుగా చేశారని విమర్శించారు. డిఏను వారి అకౌంట్స్ కు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పే స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాజీ మాట్లాడుతూ నామిని వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలని నాలుగవ తరగతి ఉద్యోగులుగా అర్హత ఉన్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ వీఆర్ఏల శ్రమను ఈ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు తక్షణమే మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు సంఘం జిల్లా కోశాధికారి గంగాధర్ రావు మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలకు వారి కుటుంబ సభ్యులకు విఆర్ఏ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలు రేపు కూడా కొనసాగుతాయని తెలిపారు ఈ రిలే నిరాహార దీక్షలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాదు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కే విజయలక్ష్మి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page